ఎవరు ఈ మోడీ ? ఎందుకు ఇంత మంది తనగురుంచి చెబుతున్నారు ?
కొంత మంచి కొంత చెడు .. కొన్ని వివరాలు ఇందులో .. మన ప్రదాని నరేంద్ర మోడీ గురుంచి.
About Narendra Modi
బాల్యం
1950, సెప్టెంబర్ 15న గుజరాత్లోని మెహ్సానా జిల్లాలోని వాద్నగర్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన నరేంద్ర మోడి పాఠశాల విద్య స్థానికంగానే పూర్తి చేశారు. గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి రాజనీతి శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పట్టా పొందినారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు నాయకుడిగా పనిచేశారు. 1970లలో విశ్వ హిందూ పరిషత్తులో చేరినారు. గుజరాత్లోని ఒక మారుమూల గ్రామంలో చాయ్ అమ్మడం ద్వారా మొదలు పెట్టిన జీవితం అనేక మలుపులు తిప్పింది. శాసనమండలి సభ్యుడిగా, గుజరాత్ రాష్ట్ర మంత్రిగా, గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవులు పొంది భారతదేశ ప్రధానమంత్రి పదవి అధిష్టిఇమ్చచార
వ్యక్తిగత జీవితం
నరేంద్ర మోడికి నలుగులు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఝానాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. వెంట ఎప్పుడు లాప్టాప్ను ఉంచు కుంటారు. ఖరీదైన దుస్తులు ధరిస్తారు. అనేక వ్యాసాలతో పాటు 3 పుస్తకాలను కూడా రచించారు. సొంత ఆస్తి కూడబెట్టుకోలేదు. మంచి వక్త, వ్యూహకర్త అయిన మోడీ జీవితంలో చాలా భాగం ఇప్పటికీ రహస్యమే. సాధారణంగా ముఖ్యమంత్రులు, మంత్రుల వంటి పదవులను అధిష్టించినవారి కుటుంబసభ్యులు ఏదో ఒక విధంగా లబ్ధి పొందుతుంటారు. రాజకీయాల్లోకి వస్తుంటారు. కానీ, మోడీ కుటుంబం ఇందుకు పూర్తి విరుద్ధం. ఆయన సోదరులు, సోదరీమణులు ఎవరి జీవితం వారిదే. తండ్రి దామోదర్దాస్ మరణించగా, తల్లి హీరాబెన్ మోడీ వద్దే ఉంటారు. మోడీ శాకాహారి.
మోడీ రాజకీయ ప్రస్థానం
గుజరాత్ లోని మొహసనా జిల్లాలోని వాద్ నగర్ పట్టణంలో 17-09-1950 దామోదర్ దాస్ ముల్ చంద్ మోడీ , హీరబెస్లకు మూడో సంతానంగా మోడీ జననం
రాజనీతి శాస్త్రం లో పీజీ
బాలుడిగా ఉన్నప్పుడే.. 1960ల్లో భారత్ - పాక్ మద్య యుద్ధం సమయంలో రైల్వే స్టేషన్ లో సైనిక సేవలు
గుజరాత్ లో పలు సామాజిక రాజకీయ ఉద్యమాల్లో క్రీయాశీల పాత్ర .
చిన్న వయస్సులోనే వివాహం అయిందని స్థానిక మీడియా పేర్కొంటుంది . కాని అయన దాన్ని బహిరంగంగా ఎక్కడ ప్రకటించలేదు .
చిన్నతనంలో సోదరుడితో కలిసి బస్సు స్టాండ్ లో టీ కొట్టు నడిపారు.
ప్రచారక్ గా జీవితాన్ని ప్రారంభించే వరకూ గుజరాత్ రోడ్డు రవాణా సంస్థ క్యాంటిన్ లో విధులు
నాగపూర్ లో అర్ ఎస్ ఎస్ లో శిక్షణ
గుజరాత్ లో ఏబీవీపి బాధ్యతలు
1987 లో బాజపా లో చేరిక. 1988 నుంచి 1995 మధ్య కాలంలో భాజపా ను అధికారంలోకి తీస్కునిరావడం లో కీలక పాత్ర
1995 లో జాతీయ కార్యదర్శిగా ఎంపికతో బాటు ఐదు రాష్ట్రాల వ్యవహారాల బాధ్యత అప్పగింత.
1998 లో ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి
07-10-2001 లో కేశుభాయ్ పటేల్ స్థానంలో తొలిసారిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎంపిక.
2002 లో రెండో దఫా ముఖ్యమంత్రిగా ఎన్నిక
2007 లో మూడో దఫా మఖ్యమంత్రిగా బాధ్యతలు
2012 లో నాల్గోసారి మఖ్యమంత్రిగా రికార్డు విజయం
2013 లో భాజపా పార్లమెంటరీ పార్టీ బోర్డు లో సభ్యుడిగా నియామకం. భాజపా ఎన్నికల ప్రచార కమిటీ సారధ్య బాధ్యతలు .
13-09-2013 లో భాజపా ప్రధానమంత్రి అభ్యర్ధిగా ఎంపిక.
2014 సార్వత్రిక ఎన్నికలలో భాజపాకు పూర్తి మెజారిటీ సాధించిపెట్టి ప్రధానమంత్రి పదవి అధిష్టించడానికి సిద్ధంగా ఉన్నారు.
మే 21, 2014 ప్రధానమంత్రి పదవి అధిష్టించడానికి వీలుగా గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
మే 26, 2014న ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు
courtesy:
http://te.wikipedia.org/wiki/%E0%B0%A8%E0%B0%B0%E0%B1%87%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0_%E0%B0%AE%E0%B1%8B%E0%B0%A1%E0%B0%BF